సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నరసాపురం ఎంపీ, రఘురామకృష్ణంరాజు మరోసారి, తెలుగు దేశం పార్టీలో ఎల్లుండి బుధవారం అధినేత చంద్రబాబు సమక్షంలో చేరనున్నారు. ఆ పార్టీ తరపున కూటమి అభ్యర్థిగా నరసాపురం పార్లమెంట్ అభ్యర్థిగా బరిలో దిగటానికి అన్ని ఏర్పాట్లు చేసుకొంటున్నారు. ఇక అధికారిక ప్రకటన తరువాయి అని తెలుస్తుంది. నిజానికి బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగాలని ఎంపీ రఘురామా కృష్ణంరాజు భావించినప్పటికీ సీట్ల సర్దుబాటులో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న 2 లోక్ సభ సీట్లు బీజేపీ కి కేటాయించడం సమంజసం కాదని, జిల్లాలో ఎన్నికలలో అన్ని ప్రాంతాలలో టీడీపీ జెండా ఎగరాలని స్థానిక టీడీపీ వర్గాల నుండి వచ్చిన విజ్ఞప్తి మేరకు.. బీజేపీ కి ఏలూరు మాత్రమే కేటాయింపు? జరిగినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో జరిగిన తర్జన భర్జనలు మధ్య రఘురామా కృష్ణంరాజు కు జనసేన మద్దతుతో టీడీపీ టికెట్ ఇవ్వడానికి చంద్రబాబు అంగీకరించినట్లు ? తెలుస్తుంది. ఇక తెలుగుదేశం పొత్తులో భాగంగా భీమవరం, తాడేపల్లిగూడెం, నరసాపురం జన సేనకు కేటాయించినట్లు భీమవరంలో కీలక జిల్లా కు చెందిన కీలక నేతలకు చంద్రబాబు స్వయంగా తెలియపర్చినట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *