సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ఎల్లుండి శుక్రవారం (ఈనెల 18న) జరుగనున్న ముఖ్య మంత్రి వైఎస్ జగన్ పర్యటన ఏర్పాట్లను కలెక్టర్ ప్రశాంతి, ప్రభుత్వ చీఫ్ విప్ ప్రసాదరాజు స్వయంగా పరిశీలిస్తున్నారు. సీఎం జగన్ తన పర్యటనలో నరసాపురం పరిసర ప్రాంతలలో , భీమవరం నియోజకవర్గ శివార్ల లో నిర్మాణం కోబోతున్న ,ఆక్వా యూనివర్సిటీ, బియ్యపుతిప్ప ఫిషింగ్ యార్డ్, కాళీపట్నం రెగ్యులేటర్ల నిర్మాణం , వాటర్గ్ ప్రాజెక్ట్, నిర్మాణం వంటి ప్రాజెక్టులకు శంకుస్థాపన, బస్టాండ్ ఆధునీకరణ, 100 పడకల ఆస్పత్రి ప్రారంభోత్సాలు చేయనున్నారు. పట్టణంలోని 25వ వార్డు వీవర్స్ కాలనీలో బహిరంగసభ నిర్వ హించే ప్రాంతంలో ఏర్పా ట్లను కలెక్టర్ ఇతర ఉన్నత అధికారులతో కల్సి పర్యవేక్షిస్తున్నారు.
