సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మలయాళం లో గతంలో ఘన విజయం అందుకున్న లూసిఫర్ తెలుగులో మెగా స్టార్ చిరంజీవి సల్మాన్ హీరోలుగా ‘గాడ్ పాదర్‘ గా రిలీజ్ అయ్యి నిరాశపరచిన విషయం తెలిసిందే. అయితే అదే లూసిఫర్ సినిమాకు సీక్వెల్ గా భారీ బడ్జెట్ తో.. భారీ అంచనాలతో నేడు గురువారం మోహన్ లాల్ (MohanLal) హీరోగా, సినిమాలో కీలక పాత్ర పోషించిన హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ డైరెక్షన్ లో రూపుదిద్దుకున్న ‘ఎల్ 2: ఎంపురాన్’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కధ విషయానికి వస్తే.. లూసిఫర్’లో రాజకీయనేత ఖురేషీ అబ్ రామ్ (మోహన్ లాల్) హఠాత్తుగా అండర్ వరల్డ్ డాన్ గా ఎలా మారాడు? ఎదిగాడు? అనేది ప్రధానాంశంగా ‘ఎంపురాన్’ కథను మొదటి చిత్రం ‘లూసిఫర్’ ఎక్కడ ఆగిందో దాదాపు అక్కడ నుండే ఈ సినిమా మొదలవుతుంది. కేరళ సీఎం పీకే రాందాస్ (సచిన్ ఖేడేకర్) హఠాన్మరణంతో అతని కుటుంబ పరిస్థితే కాదు… రాజకీయ పరిస్థితి కూడా అనిశ్చిత స్థితిలోకి వెళ్ళిపోయిన నేపథ్యంలో ఖురేషీ అబ్ రామ్ అక్కడ ప్రత్యక్షమై వాటిని చక్కదిద్ది… పీకే రాందాస్ కొడుకు జతిన్ రాందాస్ (టోవినో థామస్) ను సీఎంను చేసి, అక్కడ నుండి నిష్క్రమిస్తాడు. ఇది లూసిఫర్ కథ. అయితే ఐదేళ్ళ పాటు అధికారానికి అలవాటు పడిపోయి..తానూ అవినీతి పరుడిగా మారిపోయిన జతిన్ రాందాస్ తనే ఓ కొత్త పార్టీని పెట్టాలని భావిస్తాడు. ఆర్థికంగా బలం కోసం కేంద్రంలోని కేరళను శాసించాలని భావించే ఓ మతతత్త్వ జాతీయ పార్టీతో చేతులు కలుపుతాడు. తమ్ముడు తీసుకున్న ఈ నిర్ణయాన్ని అతని అక్క ప్రియ (మంజు వారియర్) తిరస్కరిస్తుంది. తండ్రి నేతృత్వం వహించిన పార్టీ నాయకురాలిగా కొత్త జీవితాన్ని ప్రారంభించాలను కుంటుంది. సొంత అక్క అడ్డు తొలగించాలని జతిన్ రాందాస్ భావిస్తాడు. ఆమెను కాపాడటం కోసం మరోసారి కేరళకు ఇంటర్నేషనల్ అండర్ వరల్డ్ డాన్ గా ఉన్న ఖురేషీ వస్తాడు. సబర్మతి రైలు దహనం… తదనంతరం జరిగిన గుజరాత్ అల్లర్లలో కుటుంబాన్ని కోల్పోయి పగతో రగిలిపోతున్న జాయెద్ మసూద్ (పృథ్వీరాజ్) ను మంచి మార్గంలో పెట్టి, అతని పగ తీర్చుకోవడానికి ఖురేషీ ఎలా సహకరించాడు? అనేది మరో ఉపకథ .. సినిమా ఎలా ఉందంటే..మూడు గంటల నిడివి ఉన్న ఈ సినిమా ద్వారా పలు అంశాలను తెర మీద చూపించాలని దర్శకుడు, నటుడు పృథ్వీరాజ్ తపించాడు. . అయితే… వాటిని పీల్ తో బాగోద్వేగాలతో సన్నివేశాలు చిత్రీకరించడం లో విఫలం అయ్యాడు. .హీరో మోహన్ లాల్ ఎంట్రీ కూడా సినిమా మొదలైన గంటకు జరిగింది. .ఇక సినిమా అంతటా లావిష్ గానే చిత్రీకరించిన మనిషి ప్రాణానికి విలువ లేనట్లు హింస సన్నివేశాలతో సినిమాను నింపేశారు. అయితే యాక్షన్ సీక్వెన్స్ హాలీవుడ్ చిత్రాలను గుర్తు చేసేలా మరిపించాయి. మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ ఇద్దరి సన్నివేశాలు , వారి నటన బాగుంది. అభిమన్యు సింగ్, మంజు వారియర్, టొవినో థామస్, తదితరులంతాచక్కగా నటించారు. . కానీ ప్రేక్షకుడిని కుర్చీలో బలంగా కూర్చోబెట్టే పట్టు తప్పింది. .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *