సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం బ్రాండ్ , పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇప్పు డు వరుస సినిమాల పూర్తీ చేస్తూ విడుదలకు సిద్ధం చేసే పనిలో ఉన్నాడు. కేజీ ఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శ కత్వం లో సలార్ సినిమా దాదాపు పూర్తీ కావచ్చింది. ఈ సమ్మర్ కు ముందే విడుదలకు శరవేగంగా సన్నాహాలు చేస్తున్నారు.నిజానికి ‘ఆదిపురుష్’ రావలసినప్పటికీ అది పూర్తీ యానిమేషన్ సినిమా కావడంతో దానిపై పలువురికి ఉన్న అనుమానాలు దృష్ట్యా ఆ సినిమా సలార్ రిలీజ్ అయ్యాక విడుదల చెయ్యాలని ప్లాన్ చేసారు. సలార్ సూపర్ హిట్ అయితే వెనువెంటనే పార్టు 2 షూటింగ్ మొదలు పెట్టె ఆలోచనలో నిర్మాతలు ఉన్నారు. అలాగే అశ్వనీదత్ నిర్మాతగా ప్రాజెక్ట్ కే ..500 కోట్ల బడ్జెట్ తో ప్రపంచ వ్యాప్తంగా హాలివుడ్ లో సైతం రిలీజ్ అయ్యేలా నిర్మిస్తున్న ఫాంటసీ సినిమా ( మహా భారత కర్ణుడు పాత్ర 3 వ ప్రపంచ యుద్ధ నేపధ్య కాలంలో ఉంటె..?)నాగ్ అశ్విన్ దర్శకత్వం లో ప్రాజెక్ట్ కే మూవీ కూడా షూటింగ్ జరుపుకుంటుంది. -ఇదిలా ఉంటే ‘ప్రాజెక్ట్ కే’ విషయం లో ప్రభాస్ షాకిం గ్ నిర్ణయం తీసుకున్న ట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయబోతున్నారట. కథ పరిధి , బడ్జెట్ చాలాఎక్కువగా ఉండడంతో ఒకే సినిమాలో అదంతా ఇమడ్చడం కష్టంగా ఉందని, రెండు భాగాలుగా విడుదల చేస్తే బాగుంటుందని దర్శకుడు నాగ్ అశ్విన్ , ప్రభాస్ కలసి నిర్ణయించినట్లు ఫిలిం వర్గాల వార్త! మొదటి పార్ట్ ఇప్పటికే పూర్తయిన దృష్ట్యా ఆధునిక గ్రాఫిక్ హంగులతో వచ్చే 2024 సంక్రాంతి కల్లా రిలీజ్ చేసెయ్యడం మంచిదని చర్చిస్తునట్టు తెలుస్తుంది. ఇక దర్శకుడు మారుతి, వంగా ‘స్పిరిట్’ సినిమాలు ఎలానూ షూటింగ్స్ ఈ .ఏడాదిలో ఉన్నాయి.. అల్ ది బెస్ట్ ప్రభాస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *