సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: 3 దశాబ్దాల క్రితం నుండి భారతీయ సినిమాలో ట్రెండ్ సెటర్ ఆధునిక సంగీతరూపకర్త.. ఆస్కార్ విజేత, ఇటీవల ఘన విజయం సాధించిన చావా సినిమా కు సంగీత దర్శకుడు, ఏఆర్ రెహమాన్ తీవ్ర ఛాతీ నొప్పితో ఆస్పత్రిలో చేరారనే వార్తలు రావడంతో అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో ఎమర్జెన్సీ వార్డులో చికిత్స పొందుతున్నారని తెలియడంతో అభిమానులు ఆందోళనకు అంతులేదు. అయితే, ఈ వార్తలను ఆయన సోదరి రిహానా ఖండించారు. డిహైడ్రేషన్, గ్యాస్ట్రిక్ సంబంధిత సమస్యల కారణంగా అప్పటికప్పుడు ఆస్పత్రికి వెళ్లామని ప్రకటించారు. ఈ విషయాన్ని నిర్ధారిస్తూ అపోలో ఆస్పత్రి యాజమాన్యం ఒక ప్రకటన విడుదల చేసింది. డీహైడ్రేషన్ లక్షణాలతో ఆస్పత్రిలో చేరిన ఏఆర్ రెహమాన్‌కు రొటీన్ చెకప్స్ నిర్వహించి డిశ్చార్జి చేసేస్తామని వైద్యులు ప్రకటించారు.
