సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: సీఎం చంద్రబాబు, డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను మర్యాద పూర్వకంగా ముందుగా కలుసుకొని బడ్జెట్ ప్రతులను అందజేసిన తరువాత నేటి శనివారం యూ దయం11 గంటలకు ఆర్ధికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో వరుసగా మూడోసారి బడ్జెట్ ప్రవేశపెట్టారు.. ఏపీలో అన్ని ప్రాంతాల అభివృద్ధికి సమన ప్రాధాన్యత ఇస్తూ ఏపీ వార్షిక బడ్జెట్ రూ.3,32,205 కోట్లు తో ప్రవేశపెట్టునట్లు ప్రకటించారు. ఈసారి బడ్జెట్‌ కీలక రంగాల కేటాయింపులు ఇలా ఉన్నాయి. పాఠశాల విద్య కు రూ.32,308 కోట్లు,వైద్య శాఖ రూ.19,306 కోట్లు, వ్యవసాయ శాఖ రూ.11,745 కోట్లు, సాంఘిక సంక్షేమం రూ.11,118 కోట్లు.కేటాయించగా.. అమరావతికి రూ.6 వేల కోట్లు,రోడ్లు, పోర్ట్‌, ఎయిర్‌పోర్టులు – 13,546 కోట్లు, పరిశ్రమల శాఖ – రూ.3,161 కోట్లు,,తల్లికి వందనం -9,668 కోట్లు, మహిళా, శిశు సంక్షేమం – రూ.4,581 కోట్లు బీసీ వెల్ఫేర్‌ – రూ.23,650 కోట్లు, కేటాయించారు. ఇక రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ రూ.3,32,205 కోట్లు, రెవెన్యూ వ్యయం రూ.2,56,143 కోట్లు.,మూలధన వ్యయం రూ.53,915 కోట్లుగా అంచనా,.రెవెన్యూ లోటు రూ.22,002 కోట్లు. ద్రవ్య లోటు రూ.75,868 కోట్లు,గా చూపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *