సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీలో నేడు, ఆదివారం కొండ పావులూరులో NDRF రైజింగ్ డే వేడుకలు జరిగాయి. NDRF 10వ బెటాలియన్‌ను ముఖ్యఅతిథిగా కేంద్ర హోంమంత్రి అమిత్‌షా హాజరై ప్రారంభించారు. NDRF పరికరాల గ్యాలరీని అమిత్‌షా సందర్శించారు. తిరుపతి రీజినల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌ను.. వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, కేంద్రమంత్రులు రామ్మోహన్, శ్రీనివాస వర్మ, బండి సంజయ్, మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. . ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో ఏపీ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. NDRF 20వ వ్యవస్థాపక దినోత్సవం, NIDM దక్షిణ సంస్థ కార్యాలయం అందుబాటులోకి తెచ్చామని అన్నారు. ఏపీలో కూటమికి మంచి విజయం ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తే NDRF అండగా ఉంటుందని అన్నారు. 2019 నుంచి ఏపీని ఏవిధంగా అభివృద్ధి వెనుకబడిందో మనమంతా చూశామని తెలిపారు. చంద్రబాబు, మోదీ ,పవన్ కల్యాణ్ జోడీల నాయకత్వంలో ఏపీ మూడింతల ప్రగతి సాధిస్తుందని అన్నారు. ఆరు నెలల్లో ఏపీకి మోదీ రూ. 3 లక్షల కోట్లు సాయం అందించారని తెలిపారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి రూ.11,440 కోట్లు సాయం కింద కేంద్రం కేటాయించిందని ‘‘స్టీల్ ప్లాంట్ విషయంలో ఆంధ్రుల ఆత్మగౌరవం ముడి పడి ఉంది. సున్నితమైన అంశంలో కేంద్రం ప్రజలకు భరోసా ఇచ్చింది. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం. రైల్వే జోన్ విషయంలో కేంద్రం మాట నిలబెట్టుకుంది. ఏపీకి జీవధార అయిన పోలవరం నిర్మాణం పూర్తి చేసి 2028 నాటికి నీరు ఇచ్చీ తీరుతాం. రూ. 2 లక్షల కోట్లతో విశాఖపట్నం గ్రీన్ ఎనర్జీకి కేటాయించాం. ఎయిమ్స్‌ను రూ. 1600 కోట్లతో నిర్మాణం చేస్తున్నాం. లక్షా 20 వేల కోట్లతో జాతీయ రహదారులు నిర్మాణం జరుగుతుంది.అని ప్రకటించారు. తదుపరి నేటి మధ్యాహ్నం అమిత్ షా ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. గన్నవరం విమానాశ్రయంలో ఆయనకు సీఎం చంద్రబాబు పవన్ కల్యాణ్, నారా లోకేష్ వీడ్కోలు పలికారు.
