సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్‌నుఎప్పుడు లేని విధంగా ఇటీవల కాలంలో శీతాకాలం లో కూడా వరుసగా అల్పపీడనాలు వాయుగుండాలు తుపానులు వదలటం లేదు. తాజాగా.. మరోసారి ఏపీకి తుఫాన్ ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నెల చివరిలో దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని తెలిపింది. 23న అల్పపీడనం ఏర్పడి.. 27 నాటికి తుఫాన్‌గా బలపడనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నెల 28లోపు చెన్నై, నెల్లూరు మధ్య తుఫాన్ తీరం దాటే అవకాశం ఉందని చెప్పింది. ఈ తుఫాన్ ప్రభావంతో 24 నుంచి రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. 27, 28, 29 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది.గత వారం కూడా నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి, గత నెలలో బంగాళాఖాతంలో ఏర్పడిన దానా తుఫాన్.. పలు ప్రాంతాల్లో బీభత్సం సృష్టించింది.
