సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని మరోసారి 14వ ఆర్థిక సంఘంను అడ్డుపెట్టి కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సాక్షిగా స్పష్టం చేసింది. రాజ్యసభలో వైసిపి ఎంపీ సుభాష్ చంద్ర బోస్ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి, ఇంద్రజిత్ సింగ్ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చా రు. ‘వివిధ కారణాలు, ప్రత్యేక పరిస్థితుల రీత్యా గతంలో జాతీయ అభివృద్ధి మండలి కొన్ని రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కల్పించింది. జనరల్ కేటగిరి రాష్ట్రాలు, ప్రత్యేక హోదా రాష్ట్రాల మధ్య పన్నుల పంపిణీకి సంబంధించి 14వ ఆర్థిక సంఘం ఎలాంటి వ్యత్యాసం చూపలేదు. ప్రణాళిక, ప్రణాళికేతర కింద రాష్ట్రాల అవసరాల మేరకు నిధులు బదలాయించేందుకు 14వ ఆర్థిక సంఘం అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుంది. 2015-20 మధ్య రాష్ట్రాలకు పంచే పన్నుల వాటాను 32 శాతం నుంచి 42శాతానికి కేంద్రం పెంచింది. దీనికి కొనసాగింపుగా 15వ ఆర్థిక సంఘం కూడా 41శాతం పన్నుల వాటాకు సిఫార్సు చేసింది. నిధుల పంపిణీ తరువాత కూడా వనరుల లోటు ఉండే రాష్ట్రాలకు.. రెవెన్యూ లోటు పూడ్చేందుకు గ్రాంట్స్ అందిస్తోంది’’ అని కేంద్ర మంత్రి వివరించారు. అలాగే పిల్లి సుభాష్ అడిగిన మరో ప్రశ్నకు సమాధానంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు షెడ్యూ ల్ ప్రకారం 2024 మార్చి నాటికి పూర్తి కావాల్సి ఉం దని , గడువులోగా పోలవరం పూర్తి కావడం కష్టమే అని కేంద్ర మంత్రి సమాధానం ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *