సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో నేడు, పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేసినకార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ.. ఈ రోజు .ఉత్తరాం ధ్ర నుంచి మైనార్టీ నేత మహమ్మ ద్ సాధిక్, ప్రకాశం జిల్లా దర్శికి చెందిన గరికపాటి వెంకట్ మన పార్టీలో చేరారు, ఇంకా ఎందరో నేతలు వస్తున్నారు. మనం ఏపీని కాపాడాలి. ఆంధ్రప్రదేశ్ వైసిపి పాలనలో ఏపీ కుక్కలు చింపిన విస్తరిలా మారింది. రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలి. మన జనసేన బీజేపీ తో కలిసి ఉండటం వల్ల ముస్లీమ్ మైనారిటీ లు మన పార్టీలోకి రావడం లేదని కొందరు చెబుతున్నారు. మత వివక్ష చూపించనని మాట ఇస్తున్నా, ముస్లిం లను మైనార్టీ ఓటు బ్యాంకుగా చూడను. మైనార్టీలకు అన్యాయం జరిగితే సాటి మనిషిగా నిలబడతా. అన్ని పార్టీలను చూశారు.. ఒక్కసారి జనసేనను నమ్మాలని ప్రజలను కోరుతున్నా . మాట ఇస్తే వెనక్కి తగ్గను.. ప్రకాశం జిల్లాలో వైసిపి కి ఒక్క సీటుకూడా రాకూడదు. సాధిక్ నాయకత్వం లో వైసిపి విముక్త ఉత్తరాంధ్ర కావాలి’’ అని పవన్ పిలుపు ఇచ్చారు.
