సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఏపీపీఎస్సీ 2018 గ్రూప్ 1 పరీక్ష అంశంలో హైకోర్టు నేడు, గురువారం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షను రద్దు చేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై ఏపీ హైకోర్టు తాత్కాలిక స్టే విధించింది. 2018 గ్రూప్-1 నోటిఫికేషన్ ఆధారంగా మెయిన్స్ పరీక్ష పేపర్లను రెండవ సారి, మూడవ సారి మూల్యాంకం చేయడం చట్ట విరుద్దమని ఎంపికైన అభ్యర్థుల జాబితాను రద్దు చేస్తూ ఇటీవల సింగిల్ జడ్జి తీర్పు ఇచ్చిన నేపథ్యంలో . గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షను మళ్లీ నిర్వహించాలని తీర్పులో పేర్కొన్నారు. ఈ తీర్పును సవాల్ చేస్తూ ఏపీపీఎస్సీ, రాష్ట్ర ప్రభుత్వం ఏపీ హైకోర్టులో అప్పీల్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం తాత్కాలిక స్టే విధించింది. తర్వాతి విచారణను రాష్ట్ర హైకోర్టు వారం రోజులకు వాయిదా వెయ్యడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *