సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీలోని కర్నూల్ జిల్లాలోతాజగా తీవ్ర విషాదం చోటుచేసుకుంది. శ్రీ రాఘవేంద్ర స్వామివారిని దర్శించుకునేందుకు కర్నాటక రాష్ట్రం కు చెందిన హసన్‌లో ఒకే కాలేజీలో డిగ్రీ చదువుతున్న ఏడుగురు యువకులు రెండు రోజులు సెలవులు రావడంతో శ్రీ రాఘవేంద్ర స్వామిని దర్శించుకునేందుకు మంత్రాలయం వచ్చారు. ఇందులో భాగంగానే పుణ్యక్షేత్రమైన మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామి మూల బృందావనాన్ని దర్శించుకున్నారు. (వారు దిగిన ఆఖరి సెల్ఫీ ఫై చిత్రంలో చూడవచ్చు.. ) అనంతరం గత శనివారం సాయంత్రం పుణ్యస్నానాలు ఆచరించేందుకు తుంగభద్ర నదిలోకి దిగారు. ఆ 7గురు స్నేహితులు కలిసి నదిలోపలకి వెళ్లారు. ఈ క్రమంలోనే ఒక స్నేహితుడు కాలు జారి నీటి ప్రవాహానికి కొట్టుకుపోయాడు. అతడిని పట్టుకోవడానికి మరో ఇద్దరు నీటిలో దిగారు. ఇలా అజిత్ (19), ప్రమోద్ (20), సచిన్ (20) ముగ్గురూ నీటి ప్రవాహానికి కొట్టుకుపోయారు. మరో నలుగురు ముందుగానే ప్రాణాలతో ఒడ్డుకు చేరుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని గల్లంతైన యువకుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
