సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హిందూ ఆలయాల్లో పనిచేస్తున్న అర్చకులకు జీతాలు పెంచుతూ జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. ఈ సందర్భంగా నేడు, మంగళవారం డిప్యూటీ సీఎం,దేవాదాయ శాఖ మంత్రి, కొట్టు సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఏ దేవాలయంలో నైనా రూ. 10వేల లోపు ఆదాయం ఉన్న అర్చకులకు ఇకపై రూ. 10 వేలు జీతం ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు. మొత్తం 1,146 మంది అర్చకులకు జీతాలు పెరుగుతున్నాయన్నాయని తెలిపారు. ఇటీవల రాష్ట్రంలో వాలంటీర్ వల్ల 30వేల అమ్మాయిలు మిస్సింగ్ అయినట్లు తప్పడు ప్రకటనలు చేస్తున్న జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కు ఎన్‌సీఆర్‌బీ (NCRB) రిపోర్ట్ ఎలా ఇచ్చిందో తెలియదని, అది నారా చంద్రబాబు రిపోర్ట్ అయి ఉండవచ్చునని వ్యంగ్యంగా అన్నారు. పవన్ ఉన్మాదంతో ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నారని విమర్శించారు.
