సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని డ్రైవర్ల సం క్షేమం కోసం ‘ఆటో డ్రైవర్ సేవలో’ పథకానికి శ్రీకారం చుట్టింది. ఏపీలో సొంత ఆటో రిక్షా,మోటార్ క్యాబ్, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు ఏడాదికి రూ.15 వేల చొప్పు న ఆర్ధిక సహాయం ప్రారంభించారు. నేడు, శనివారం విజయవాడ సెంట్రల్నియోజకవర్గ పరిధిలో ముఖ్యమంత్రి చంద్రబాబు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, లు కొద్దీ సేపు ఆటో రిక్షాలో ప్రయాణం చేసి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు, తదుపరి విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ తో పాటు ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్య క్షుడు మాధవ్ సమక్షంలో నిధులను విడుదల చేసారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,90,669 మంది లబ్ధిదారులను అర్హులుగా ప్రభుత్వం గుర్తించింది. ఇందుకోసం రూ. 436 కోట్లను కేటాయించింది ప్రభుత్వం. ఇక, ఈ నిధులను నేరుగా డ్రైవర్ల ఖాతాలో జమా చేసినట్లు ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *