సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల ఏపీలో ఆరోగ్యశ్రీ లో ప్రజలు పలు సేవలు అందక పడుతున్న ఇబ్బందులకు తోడు తాజగా ఆంధ్ర ప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ తీసుకున్న నిర్ణయం మేరకు, నెట్‌వర్క్ ఆస్పత్రులు నేటి శనివారం నుంచి ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ కింద అందించే ఎమర్జెన్సీ సహా అన్ని రకాల వైద్య సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. రాష్ట్రములో కూటమి ప్రభుత్వం 2,700 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించాలని నెట్‌వర్క్ ఆస్పత్రులు డిమాండ్ చేస్తున్నాయి. తమకు ఆసుపత్రుల నిర్వహణ కష్టంగా మారిందని ప్రభుత్వం బకాయిలు చెల్లిస్తేనే తప్ప ప్రజలకు ట్రీట్‌మెంట్ విషయంలో ముందుకు పోలేమని ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ సెక్రటరీ శరత్‌బాబు తెలిపారు. ఇప్పటికే సమ్మె విరమించాలని కూటమి ప్రభుత్వం,హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ విజ్ఞప్తి చేసినా.. చర్చలు జరిపినప్పటికి బకాయిలు విడుదల చేయకపోవడంతో పేదలకు సామాన్యులకు వైద్యం నిలచిపోయింది.
