సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ప్రస్తుతం ఏపీలో విద్యార్థులకు పరీక్షల సీజన్ కొనసాగుతుంది. 10 వ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయి..ఇప్పటికే ఇంటర్మీడియట్ ప్రధాన పరీక్షలన్నీ మొన్న మార్చి 18వ తేదీతోనే ముగిసాయి. ఇంకా సంబంధిత పరీక్షలు మాత్రం ఈ మార్చి 25వ తేదీతో ఇవి ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో ఇంటర్మీడియట్ పరీక్షల జవాబు పత్రాల మార్కుల లెక్కింపు మార్చి 23వ తేదీ అంటే రేపటి సోమవారం నుంచి ప్రారంభించనున్నారు. అందుకోసం ప్రభుత్వం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ పరీక్షల ఫలితాలను ఏప్రిల్ రెండో వారంలో శరవేగంగా విడుదల చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు ఇంటర్మీడియట్ విద్యా మండలి కార్యదర్శి రంజిత్ బాషా తెలిపారు, .రాష్ట్రవ్యాప్తంగా 25 జిల్లా కేంద్రాల్లో ఈ మూల్యాంకనం కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఒక్కో లెక్చరర్‌కు ఉదయం 15, మధ్యాహ్నం 15 జవాబు పత్రాలను మూల్యాంకనానికి ఇస్తారు.
