సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీలో ఇంటర్మీడియన్ ఫస్ట్ ఇయర్, సెకండియర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు నేటి శనివారం ఉదయం 11 గంటలకు ఇంటర్మీడియట్ విద్యామండలి కార్యదర్శి కృతికా శుక్లా విడుదల చేసారు. సప్లీ పరీక్షలు రాసిన విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ https://resultsbie.ap.gov.in/ లో తమ ఫలితాలు తెలుసుకోవచ్చు. లేదా మన మిత్ర’ వాట్సప్ నంబరు 9552300009 ద్వారా కూడా ఫలితాలు పొందవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు మే 12 నుంచి 20 వరకు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఫస్ట్ ఇయర్‌లో 1,35,826 మంది, సెకండియర్‌లో 97,963 మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాశారు. 2024-25 విద్యా సంవత్సరానికి టెన్త్, ఇంటర్‌లో ఎక్కువ మార్కులు సాధించిన ప్రభుత్వ, ప్రైవేటు విద్యార్థులను మండల వారిగా ఎంపిక చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వాళ్లకి ఈ షైనింగ్ స్టార్ అవార్డులు ఇవ్వాలని తెలియజేసింది.
