సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రాష్ట్రంలో మార్చి 1 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్ పరీక్షల హల్ టికెట్స్ ను పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ తాజగా విడుదల చేశారు. విజయవాడలోని ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆయన మాట్లాడుతూ.. ఈ ఏడాది బోర్డు పరీక్షలకు ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం విద్యార్థులు 10,52,221 మంది హాజరవుతున్నారన్నారు. ప్రభుత్వం అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో నాడు–నేడు కార్యక్రమం కింద మౌలిక సదుపాయాలను పునరుద్ధరిస్తోందని, ఇప్పటికే పనులు పూర్తయిన ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లోని పరీక్ష కేంద్రాలను చూసి ప్రైవేట్ యాజమాన్యాలు ఆశ్చర్యపోతాయన్నా రు.
