సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో విద్యార్థులకు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలను మార్చి 15 నుంచి నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి శేషగిరిబాబు ప్రకటిం చారు. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల పరీక్షల షెడ్యూలును విడుదల చేశారు. మానవ విలువలు, ఎథిక్స్ పరీక్ష మాత్రం ఫిబ్రవరి 22న, పర్యావరణ విద్య పరీక్ష 24న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఉంటాయి. ఇక ప్రాక్టికల్ పరీక్షలు ఏప్రిల్ 15 నుండి 25 వరకు, ఏప్రిల్ 30 నుండి మే 10వరకు నిర్వహించనున్నారు. రోజూ రెండు విడతల్లో ఆదివారం కూడా నిర్వహిస్తారు. (గత పరిణామాలు దృష్ట్యా..పొంచి ఉన్న కోవిద్ కేసుల ప్రమాదం దృష్టిలో ఉంచుకొని ముందు చూపుతో ఇంటర్ పరిక్షలు షెడ్యూలు ప్రకటించినట్లు భావించవచ్చు..)
