సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ https://examresults.ap.nic.in లో అందుబాటులో ఉంచారు. ఇంటర్ ఫస్టియర్ పరీక్షలను 4,33,275 మంది విద్యార్థులు రాయగా, ఇంటర్ సెకండియర్ పరీక్షలను 3,79,758 మంది విద్యార్థులు రాశారని అధికారులు తెలిపారు. ఏపీలో ఇంటర్ ఫస్టియర్‌లో కేవలం 61 శాతం, ఇంటర్ సెకండియర్‌లో 72 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు 70 శాతం ఉత్తీర్ణత తో పశ్చిమ గోదావరి జిల్లా 2వ స్థానంలో నిలవడం విశేషం, ఇంటర్ 2 ఏళ్ళు కలపి 83 శాతం ఉత్తీర్ణతతో కృష్ణా జిల్లా ప్రథమ స్థానంలో ఉండగా, గుంటూరు జిల్లా 2వ స్థానంలోనూ 3వ స్తానం లో 77 శాతం ఉత్తీర్ణతతో పశ్చిమ గోదావరి జిల్లా ఉండటం విశేషం, 46 శాతం ఉత్తీర్ణతతో ఆఖరి స్థానంలో కడప జిల్లా ఉందని ఇంటర్ బోర్డు అధికారులు పేర్కొన్నారు.మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు నిర్వహించిన ఈ పరీక్షలకు ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల విద్యార్థులు సుమారు 10 లక్షల మంది హాజరయ్యారు. 9,20,552 మంది రెగ్యులర్ విద్యార్థులు, 83,749 మంది ఒకేషనల్ విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. పరీక్షలు ముగిసిన 22 రోజుల్లోనే విద్యాశాఖ ఫలితాలను విడుదల చెయ్యడం ఒక రికార్డు గా పేర్కొనాలి,
