సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని ఇంటర్మీడియట్ విద్యలో ప్రతిపాదిత నూతన సంస్కరణలతో ఇంటర్ ఫస్ట్ ఇయర్ పబ్లిక్ పరీక్షలు రద్దు చేయాలని ఇంటర్ బోర్డు ఇటీవల నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే ఈ విధానం వచ్చే ఏడాది నుంచి అమలు చేయనున్నట్లు ఇంటర్ బోర్డు ఇప్పటికే ప్రకటించింది. అయితే ఈ నిర్ణయంపై ఇంటర్ బోర్డు పునరాలోచనలో పడింది. . జాతీయ విద్య పరిశోధన, శిక్షణ మండలి (ఎన్‌సీఈఆర్టీ) సిలబస్ అమలు, పరీక్షల నిర్వహణ, అంతర్గత మార్కుల విధానం లాంటి పలు ప్రతిపాదనలను ఇటీవల ఇంటర్మీడియట్ విద్యామండలి ప్రకటించింది.ఈ ప్రతిపాదనలపై జనవరి 26 వరకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించింది. ఈ సూచనల మేరకు ఇంటర్మీడియట్ మొదటి ఏడాది విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలు యథాతథంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి ఏడాది పరీక్షలు నిర్వహించకపోతే విద్యార్థులుల్లో చదువు లోను జ్ఞాపక శక్తిలోను సామర్థ్యాలు తగ్గిపోతాయని, పైగా 2వ ఏడాది తీవ్ర ఒత్తిడికి లోను అవుతారని పలు సూచనలు రావడంతో ఇంటర్ బోర్డు అంతర్గత మార్కుల విధానం ప్రతిపాదనలను విరమించుకోనుంది.అని సమాచారం.. అధికారికంగా ప్రకటించవలసి ఉంది. . కాగా ఈ ఏడాది మార్చి 1వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు, అలాగే మార్చి 3వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఇంటర్ రెండో సంవత్సరం పరీక్షలు నిర్వహించనున్నారు.
