సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రాగల 12 గంటల్లో ఈ తీవ్ర వాయుగుండం శ్రీలంక తీరాన్ని తాకుతూ ఉత్తర వాయువ్య దిశగా.. నేటి గురువారం రాత్రి కి లేదా రేపు శుక్రవారం ఉదయానికి తుఫాన్‌గా బలపడే అవకాశముందని చెప్పింది. ఇది ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి తీరాలలో.. కరైకల్, మహాబలిపురం మధ్య నవంబర్ 30వ తేదీ ఉదయం తీరం దాటే అవకాశముందని వాతావరణ నిపుణలు అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో ఏపీలో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి.రానున్న 24 గంటలలో తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు, నెల్లూరు జిల్లాలో అతి భారీ వర్షాలు కురుస్తాయని ఆ క్రమంలో రెడ్ అలర్ట్ జారీ చేసారు. . . అలాగే ప్రకాశం, సత్యసాయి, వైఎస్ఆర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. దీంతో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అయితే తుపాను తీరం దాటే సమయంలో.. దక్షిణ కోస్తా తీరం వెంబడి 45 నుంచి 55 వరకు గరిష్టంగా 65 కిలోమీటర్లు వేగంతో గాలులువీస్తాయి. దీంతో సముద్రంలో చేపలు వేటకు వెళ్ల వద్దని మత్య్సకారులను హెచ్చరించింది. ఏపీలోని అన్ని పోర్టులలో ఒకటివ నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేసారు.
