సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, సోమవారం రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై వైసీపీ తరపున చర్చలో పాల్గొన్న వైసీపీ రాజ్యసభ ఎంపీ మేడా రఘునాధ రెడ్డి మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల అనంతరం టీడీపీ శ్రేణులు ప్రణాళిక బద్దంగా చేస్తున్న దాడులలో హింస పెచ్చరిల్లుతోందని, వైసీపీ నేతలపై వారి ఆస్తులపై దాడులు అధికమయ్యాయని, వై ఎస్ ఆర్ విగ్రహాలను ధ్వసం చేస్తున్నారని , విద్య యూనివర్సిటీల విసి లను అవమాన పరుస్తూ వారిని రాజీనామాలు చేయిస్తున్నారని, ఏపీలో కొన్ని మీడియా ఛానల్స్ ను భయపెడుతూ ప్రసారాలను కేబుల్ టీవీలలో నిలిపివేయిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ అంశంలో జోక్యం చేసుకోవాలి. ఏపీలో ప్రజలందరి భద్రతకు తగిన చర్యలు తీసుకోవాలి. అలాగే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి. ప్రత్యేక హోదా నిరాకరించడం మా రాజ్యాంగ హక్కులను ఉల్లంఘించడమే. పార్లమెంటులో ఇచ్చిన ప్రత్యేక హోదా వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలి, అని డిమాండ్ చేసారు.
