సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఎట్టకేలకు ఏపీ లో ప్రభుత్వ ఆస్పత్రుల అసోషియేషన్‌తో రాష్ట్ర ప్రభుత్వం (AP Govt) జరిపిన చర్చలు ఫలించాయి. ఇక సమ్మె విరమించాలని ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ కింద ఉన్న స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా వైద్య సేవా పథకం కింద సేవలన్నింటినీ పున:ప్రారంభించాలని నిర్ణయించినట్లు అసోసియేషన్ ప్రకటించింది. నేడు, శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్‌తో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమర్ యాదవ్ చర్చలు జరిపారు. వెంటనే రూ.250 కోట్ల బకాయిల చెల్లింపునకు ప్రభుత్వం అంగీకారం తెలపడంతో ప్రభుత్వ ఆస్పత్రుల అసోషియేషన్ సమ్మె విరమించింది. మరల వచ్చే నవంబర్ 15లోపు 250 కోట్ల రూపాయలు విడుదల చేసేందుకు, మిగతా బకాయిలు కూడా త్వరలోనే చెల్లించడానికి ప్రభుత్వం అంగీకరించిందని అసోషియేషన్ ప్రకటించింది.
