సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగు రాష్ట్రాల్లో అప్పుడే ఎండలు హడలెత్తిస్తున్నాయి. ఉదయం 10 గంటల నుంచే సామాన్యులు ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ ఎండల తీవ్రం నానాటికీ పెరుగుతుంది. ఈ ఏడాది ఎండలు తీవ్రంగా ఉంటాయన్న హెచ్చరికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యా సంస్థలకు మార్చి 15 నుంచి ఒంటి పూట బడులు నిర్వహించనున్నారు. అయితే ఎండల తీవ్ర పెరుగుతున్నందున ఒంటిపూట బడులను మార్చి మొదటి వారం నుంచే నిర్వహించాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు. దీనిపై ప్రభుత్వం నుంచి స్పందన రాలేదు.
