సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకొంది రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి 55 మంది ప్రభుత్వ వైద్యులను (55 Medical Employees) విధుల నుంచి తొలగించింది . దీనికి కారణం విశ్లేషిస్తే.. కృష్ణా జిల్లా ఉయ్యూరుకు చెందిన మాజీ సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ లోకాయుక్తకు కొందరు వైద్యుల నిర్లక్ష్యం ఫై ఫిర్యాదు చేశారు. ఎలాంటి అనుమతి, సెలవు లేకుండా ఏడాదికి పైగా వైద్యులు గైర్హాజరవుతున్నారని, వైద్యులు లేక రోగులు ఇబ్బంది పడుతున్నారని ఆయన ఫిర్యాదు చేశారు.లోకాయుక్త (Lokayukta) అదేశాలతో విధులకు ఎటువంటి అనుమతులు లేకుండా, సుదీర్ఘ కాలం ఎగ్గొటిన వైద్యులను,ప్రభుత్వం టర్మీనేట్ చేసింది. ఈ మేరకు చర్యలు తీసుకున్నట్టు వైద్య, ఆరోగ్య శాఖ లోకాయుక్తకు నివేదిక పంపింది. తొలగింపునకు గురైన వైద్యుల్లో అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉన్నారు.
