సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మరో 4 నెలలులో ఎన్నికలు సమీపిస్తున్న వేళా.. ఏపీలో జగన్ సర్కార్ కాం ట్రాక్టు ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ గైడ్‌లైన్స్‌ ను విడుదల చేసింది. ఈ మేరకు ఆర్థిక శాఖ గైడ్‌ లైన్స్ జారీ చేసింది. రేపటి శుక్రవారం నుండి అంటే ఈ నెల 15 వ తేదీ నుంచి రెగ్యులరైజేషన్ కోసం కాంట్రాక్టు ఉద్యోగుల నమోదు ప్రక్రియ ప్రారంభం కానుంది. సంక్రాంతి లోపు రెగ్యులరైజేషన్ పూర్తి చేసేందుకు ఏపీ ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది. తమకు ఇచ్చిన మాట ప్రకారం కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ చేపట్టినందుకు సీఎం జగన్‌కు ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఛైర్మన్ వెంకట రామిరెడ్డి కృతజ్ఞలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *