సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీలో ప్రజలకు సినిమా వినోదం చాల ఖరీదు గా మారిపోయింది. వరుస పరాజయాలతో ఇటీవల ఫ్యామిలీస్టార్ వంటి డిజాస్ట‌ర్ త‌ర్వాత కూడా విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) నటించిన భారీ బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘కింగ్‌డమ్’ (Kingdom) ను ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ తెర‌కెక్కించ‌గా జ‌ర్సీఫేమ్ గౌత‌మ్ తిన్న‌నూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. భాగ్య‌శ్రీ భోర్సే క‌థానాయిక‌గా న‌టించ‌గా స‌త్య‌దేవ్ కీల‌క పాత్ర‌లో పోషించాడు. ఈ చిత్రం ఈ నెల జూలై 31న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా ఈ చిత్రానికి ప్రత్యేక టికెట్ రేట్ల పెంపుకి తాజగా జీవో జారీ చేసింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్ ధరపై రూ.50, మల్టీప్లెక్స్ థియేటర్లలో రూ.75 అదనంగా వ‌సూలు చేయ‌నున్నారు. ఈ పెరిగిన ధ‌ర‌లు ప‌ది రోజులు అమలు చేస్తారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *