సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిసెంబర్ చివరి నుంచి యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేని ప్రారంభిస్తోంది. ఈ సర్వే కోసం ప్రభుత్వం జీవో నంబర్ 207 జారీ చేసింది. దీన్నే మనం కుటుంబ సర్వే అని భావించవచ్చు. ప్రభుత్వ పధకాలు కోరుకొనే ఏపీ ప్రజలంతా ఈ సర్వేలో తప్పనిసరిగా సచివాలయ ఉద్యోగులకు సహకరించాలి. ఈ సర్వే కోసం. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం Unified Family Survey (UFS) 2025 అధికారిక యాప్‌ని ఇచ్చింది. ఈ యాప్ ద్వారా.. సచివాలయ ఉద్యోగులు ప్రతి కుటుంబం పూర్తి వివరాలు నమోదు చేస్తారు. సంబంధిత కుటుంబానికి ఉన్న ఆస్తులు, అప్పులు, వాహనాల వివరాల్ని నమోదు చేస్తారు. అని సమాచారం. అలాగే.. కుటుంబంలోని ప్రతీ వ్యక్తి నుంచి ఈ-కేవైసీ పూర్తి చేయిస్తారు. ప్రజలు కుటుంబానికి సంబందించి ముఖ్యమైన పత్రాలన్నీ రెడీగా ఉంచుకోవాలి. అయితే అన్ని వివరాలు ఇస్తే ప్రభుత్వ పథకాలు రద్దవుతాయా?: ఈ కుటుంబ సర్వే అనగానే ఏపీలోని చాలా కుటుంబాల్లో పెద్ద టెన్షన్ ఉంది. అయితే దానిపై ప్రభుత్వ వివరణ లేదు. అసలు ప్రజలకు సంబంధించిన వాస్తవ ఆర్థిక పరిస్థితి, ఆరోగ్య పరిస్థితి, ఉద్యోగాల స్థితి వంటి వివరాలు తెలుసుకొనేందుకు ప్రభుత్వం సర్వే చేయిస్తోంది
