సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: శేఖర్ కమ్ముల దర్శకత్వంలో టాలీవుడ్ కింగ్‌ నాగార్జున, కోలీవుడ్ స్టార్‌ ధనుష్‌, రష్మిక మందాన ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘కుబేరా’. ఈ సినిమా రేపు 20న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ నేపథ్యంలో ‘కుబేరా’ చిత్రబృందానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. టికెట్ ధరల పెంపునకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విడుదల తేదీ నుంచి 10 రోజులపాటు సింగిల్ స్క్రీన్స్‌, మల్టీప్లెక్స్‌లలో టికెట్ ధరలను జీఎస్టీతో కలిపి రూ.75 వరకు పెంచుకునేలా అనుమతి ఇచ్చింది. అయితే, తెలంగాణలో మాత్రం టికెట్ ధరల విషయంలో ఎలాంటి మార్పులు లేవు. సింగిల్ స్క్రీన్, మల్టీప్లెక్స్‌లలో ఇప్పటివరకూ అమల్లో ఉన్న ధరలకె టికెట్స్ అమ్మవలసి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *