సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రాజమండ్రిలో విశేషంగా తరలివచ్చిన కూటమి పార్టీల శ్రేణుల మధ్య ప్రధాని మోడీ బహిరంగ సభలో చంద్రబాబు పవన్ కళ్యాణ్, పురంధరేశ్వరి , లోకేష్ ల సమక్షంలో బహిరంగ సభ విజయవంతం అయ్యింది. ప్రధాని మోడీ కి నరసాపురం బీజేపీ ఎంపీ అభ్యర్థి శ్రీనివాస్ వర్మ విల్లు అమ్ములు కానుకగా సమర్పించి సన్మానించడం విశేషం. ప్రధాని మోడీ మాట్లాడుతూ.. కేంద్రంతో పాటు ఈసారి ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్డీయే సర్కార్ ఏర్పడుతుందనిఅన్నారు. ఏపీకి మోదీ గ్యారెంటీ.. బాబు నాయకత్వం, పవన్ విశ్వాసం అవసరం అని ప్రధాని మోదీ అన్నారు. సమైక్య ఆంధ్ర ప్రదేశ్ ను అభివృద్ధి లో టాప్ లో చంద్రబాబు నిలిపారన్నారు. ఇక్కడ వైసీపీ పార్టీకి 5 సంవత్సరాలు పాలించే అవకాశం వచ్చినా.. వారు ఉపయోగించుకోలేకపోయారని అన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధిలో వెనక్కి తీసుకెళ్లిందన్నారు. అందుకే వైసీపీని ప్రజలు తిరస్కరిస్తున్నారని ప్రధాని అన్నారు. వైసీపీ పార్టీకి రాష్ట్ర ఆర్థిక నియంత్రణ తెలియదు. అప్పులతో అవినీతి తో రాష్ట్రాన్ని క్రిందకి తీసుకొనివెళ్ళిందని విమర్శించారు. 3 రాజధానులు నిర్మిస్తామని ఏ రాజధాని లేకుండా చేసారని ఏపీ రాజధాని నిర్మాణానికి కేంద్రం రూ.15వేల కోట్లు ఇవ్వాలని కేంద్రం భావించింది. కానీ కేంద్ర నిధులను వైసీపీ సర్కారు అందుకోలేకపోయింది. అని విమర్శించారు .ఏపీలో మద్యనిషేధం పేరు చెప్పి వైసీపీ అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చాక మద్యం సిండికేట్గా తయారయ్యారు. జరగనున్న ఎన్నికలలో వికసిత ఆంధ్ర, వికసిత భారత్ తమ లక్ష్యం అని పేర్కొన్నారు.
