సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: ఇటీవల దక్షిణ భారతదేశంలో కొత్తగా మొదలయిన స్క్రబ్ టైఫస్( scrub typhus) ఏపీలో కూడా కలకలం సృష్టిస్తుంది. ఈ లక్షణాలతో పల్నాడు జిల్లాలో ఇద్దరు మహిళలు మృతి చెందారు. మరొకరు చికిత్స పొందుతున్నారు. ముప్పాళ్ల మండలం రుద్రవరం గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్థిని జ్యోతి జ్వరం, ఒంటినొప్పులతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 20 రోజుల క్రితం మరణించింది. రాజుపాలెంకు చెందిన వృద్ధురాలు నాగమ్మ కూడా జ్వరంతో చికిత్స పొందుతూ 20 రోజుల క్రితం మృతి చెందింది. అలానే రాజుపాలెం మండలం కొత్తూరుకు చెందిన మరో వృద్ధురాలు సాలమ్మ కూడా స్క్రబ్ టైఫస్(scrub typhus) లక్షణాలతో ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. చనిపోయిన జ్యోతి, నాగమ్మల శాంపిల్స్ ను టెస్టుల కోసం ముంబై కు పంపించగా . పరీక్షల్లో స్క్రబ్ టైఫస్‌తో మృతిచెందినట్లు రిపోర్టుల్లో తేలినట్లు ప్రచారం జరుగుతుంది. దీనిపై సీఎం చంద్రబాబు కూడా వైద్య అధికారులు అలర్ట్ కావాలని, ఈవ్యాధి లక్షణాలపై ప్రజలకు ముందే అవగాహనా కల్పించాలని ఆదేశించారు. నిజానికి నల్లిని పోలిన చిన్న కీటకం స్క్రబ్ టైఫస్. దీని కాటుతో సోకే బ్యాక్టీరియా ప్రభావాన్ని గుర్తించేందుకు గుంటూరు సమగ్రాసుపత్రిలో ప్రయోగశాల ఉందని జిల్లా వైద్యాధికారి డాక్టర్ రవి తెలిపారు. అనుమానిత లక్షణాలున్న వారి రక్త నమునాలు పంపితే నిర్ధారణ పరీక్షలు చేస్తామని పాజిటివ్‌గా గుర్తిస్తే చికిత్స అందిస్తారని తెలిపారు. ఇది మనుషుల నుంచి మనుషులకు వ్యాపించదని వైద్యనిపుణులు తెలిపారు.
