సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి సర్కార్ నేతృత్వంలో మళ్ళి జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల పునర్వ్యవస్థీకరణ అంశం పట్టాలు ఎక్కడంతో దాదాపు 3 కొత్త జిల్లాల ఏర్పాటుకు చంద్రబాబు సర్కార్ ఆమోద దిశగా అడుగులు పడినట్లు సమాచారం . కొత్త జిల్లాలు, డివిజన్ల సరిహద్దుల మార్పులపై సీఎం చంద్రబాబు గత సోమవారం సచివాలయంలో మంత్రివర్గం, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. దీనిలో కొత్త జిల్లాలుగా.. మార్కాపురం, మదనపల్లె కేంద్రాలుగా రెండు కొత్త జిల్లాల ఏర్పాటు దాదాపు ఖరారు చేసారని పోలవరం ప్రాజెక్ట్ ముంపు ప్రాంతాల అభివృద్ధి కోసం రంపచోడవరం కేంద్రంగా మరో కొత్త జిల్లా ఏర్పాటు ప్రతిపాదన కూడా తాజాగా చర్చకు వచ్చింది. ‘రంపచోడవరం’–చింతూరు డివిజన్లు ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉన్నప్పటికీ, అవి తూర్పుగోదావరి జిల్లాలో కలిస్తే జిల్లా విస్తీర్ణం, జనాభా మరింత పెరగనుంది. ఇదే నేపథ్యంలో రంపచోడవరాన్ని కొత్త జిల్లా కేంద్రంగా ప్రతిపాదించాలని అధికారులు సూచించారు.
