సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీలో రాష్ట్రవ్యాప్తంగా గత వైసీపీ ప్రభుత్వం నియమించిన ఇంటింటికి వెళ్లి రేషన్ అందించే వాహనాలు ఇక మరుగున పడుతున్న వేళ.. రేషన్ డీలర్ల భర్తీ, మరియు 4వేల కొత్త రేషన్ షాపుల ఏర్పాటుపై రేపటి క్యాబినెట్ లో చర్చించనున్నారు. అటు త్వరలోనే కొత్త రేషన్ కార్డుల తుది డిజైన్ కూడా ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు సర్కార్. కొత్త రేషన్ కార్డుల జారీకి కసరత్తు చేస్తోంది. అర్హులకు కొత్త రేషన్ కార్డులను జారీ చేయడంతో పాటు పాత రేషన్ కార్డులో కొత్త వారిని చేర్చడం, అడ్రస్ మార్పు తదితర వ్యవహారాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతోంది.ఇక రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 6వేల రేషన్ డీలర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీనికి సంబంధించి 4వేల కొత్త రేషన్ షాపులు కూడా భర్తీ చేసేందుకు పూర్తి స్థాయిలో ఇప్పటికే కసరత్తు పూర్తీ అయిందని సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *