సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ లో ఒక్కసారిగా కురుస్తున్న వర్షాలకు కోస్తా ఆంధ్ర అంతటా రైతులు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.మరోవైపు కృష్ణా, గోదావరి నదులు ఉగ్రరూపం చూపిస్తున్నాయి. విజయవాడ లోని ప్రకాశం బ్యారేజి వద్ద కృష్ణ నది భారీగా వరద ప్రవాహం ఉదృతి మేరకు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసారు. ప్రస్తుత ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 4.92 లక్షల క్యూసెక్కులుగా గోదావరి ప్రవహిస్తుందని అధికారులు ప్రకటించారు. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 42.2అడుగులగా ఉండగా రాజమండ్రి ధవళేశ్వరంలో కాటన్ బ్యారేజి వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 7.38లక్షల క్యూసెక్కులుగా ఉండటంతో గోదావరి జిల్లాల అధికార యంత్రాంగం అప్రమత్తం అయ్యింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు సహాయక చర్యల కోసం రూ.16 కోట్లు మంజూరు చేసింది. SDRF బృందాలు లంక గ్రామాలలోని ప్రజల కోసం రక్షణ చర్యలు చేపట్టారు.
