సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఎట్టకేలకు గందరగోళం మధ్యే ఏపీలో గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలు ముగిసాయి. పలువురు అభ్యర్థుల అభిప్రాయాలు మేరకు గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష వాయిదా వెయ్యండని రాష్ట్ర ప్రభుత్వం బోర్డు ను కోరిందని వార్తలు వచ్చినప్పటికీ.. వాయిదా వేయడం కుదరదు అంటూ ఏపీపీఎస్సీ.. షెడ్యూల్ ప్రకారమే ఎగ్జామ్ ను నిర్వహించింది. అయితే.. గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) తెలిపింది.గత ఆదివారం నిర్వహించిన గ్రూప్-2 మెయిన్స్ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న 92,250 మంది అభ్యర్థుల్లో 86,459 మంది హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారు. వారిలో 92శాతం మంది హాజరయ్యారని ఏపీపీఎస్సీ అధికారులు ప్రకటించారు.
