సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మరఠ్వాడ నుంచి మధ్య మహారాష్ట్ర ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం ఆవరించి ఉంది. సముద్ర మట్టం నుంచి సగటున 1.5 కిలోమీటర్ల ఎత్తులో కేంద్రీకృతమైందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. అక్కడక్కడ వర్షాలు పడుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్ర‌జ‌ల‌కు ఒక్క‌సారిగా వాతావ‌ర‌ణం చ‌ల్లబ‌డింది. ఇంకా 5రోజుల పాటు వ‌ర్షాలు ప‌డే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ ప్ర‌క‌టించింది. ఏపీలో కోస్త తీరంలో కొన్ని జిల్లాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది.ఉత్తర, మధ్య తెలంగాణ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసింది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *