సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో లోక్ సభ , అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి 2027 లోనే నిర్వహిస్తారని దేశవ్యాప్తంగా వస్తున్నా సంకేతాలుతో పాటు రాజకీయ విశేషకులు విశ్లేషణ ప్రకారం.. పొరుగు దేశాలలో హిందువులపై సాగుతున్న దారుణాలు నేపథ్యంలో ప్రస్తుతం దేశంలో ఊపందుకున్న ‘హిందుత్వ ఐక్యత’ రాజకీయ పరిణామాలలో ఇదే బీజేపీ కి మంచి సమయం అని విశ్లేషిస్తున్న నేపథ్యంలో.. ఏపీ సీఎం చంద్రబాబు మాత్రం తాజగా మరో మారు.. అస్తవ్యస్తంగా ఉన్న ఏపీని ఇప్పుడే గాడిన పెడుతున్నామని, జమిలీ అమల్లోకి వచ్చినా.. ఎన్నికలు జరిగేది మాత్రం 2029లోనే అని స్పష్టం చేశారు. జమిలి ఎన్నికలు కోసం రెండు బిల్లులకు ఇటీవలే కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. అంతే శరవేగంగా ఈ రెండు బిల్లు మరో రెండు రోజుల్లో పార్లమెంటుసమావేశాలలోనే ముందుకు రానున్నాయి. ఈ నేపథ్యంలో జమిలి ఎన్నికలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు, శనివారం మాట్లాడుతూ.. జమిలీ అమల్లోకి వచ్చినా.. ఎన్నికలు జరిగేది మాత్రం 2029లోనే అని స్పష్టం చేశారు. ఒక దేశం, ఒకే ఎన్నిక విధానానికి ఇప్పటికే తమ మద్దతు ప్రకటించామన్నారు. జమిలీపై అవగాహన లేని వైసీపీ నేతలు మాత్రం రాజకీయ పబ్బం గడుపుకోవటానికి ఏదిపడితే అది మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు.
