సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీలో డిగ్రీ కళాశాలల్లో 290 లెక్చరర్ పోస్టుల భర్తీకి ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమయింది. అర్హులైన అభ్యర్థులు ఏపీపీఎస్సీ వెబ్ సైట్ ద్వారా ఫిబ్రవరి 13 అర్ధరాత్రి 11.59 గంటల వరకు https://psc.ap.gov.in/ (https://portalpsc.ap.gov.in/Default.aspx) వెబ్ సైట్ దరఖాస్తు చేసుకోవాలి. గతేడాది డిసెంబర్ 30న మొత్తం 240 పోస్టుల భర్తీకి APPSC నోటిఫికేషన్ విడుదల చేయగా.. ఇప్పుడు తాజాగా మరో 50 పోస్టులను అదనంగా పెంచుతూ దరఖాస్తులను ఆన్ లైన్ లో ఆహ్వానిస్తున్నారు.
