సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీలో డీఎస్సీ పరీక్షల షెడ్యూలును ప్రభుత్వం సవరించింది. కొత్త షెడ్యూలు ప్రకారం ఈ నెల 30 నుంచి ఏప్రిల్ 30 వరకు డీఎస్సీ పరీక్షలు జరుగుతాయని మంత్రి బొత్స సత్యనారాయణ తాజగా ప్రకటించారు. మొదట ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఈ నెల 15న పరీక్షలు ప్రారంభం కావాలని, కానీ, పలు కారణాలతో వాయిదా వేసినట్లు పేర్కొన్నారు. నెల వ్యవధిలో 14 రోజులు పరీక్షలు జరుగుతాయని, ప్రతిరోజూ ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో నిర్వహిస్తామని వివరించారు. ఈ నెల 20 నుంచి అభ్యర్థులు పరీక్షా కేంద్రాలను ఎంపిక చేసుకోవచ్చని, 25 నుండి హల్ టికెట్స్ అందుబాటులో ఉంటాయని తెలిపారు.
