సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: : ఆంధ్రప్రదేశ్లో దీపావళి పండుగ సెలవును 12వ తేదీ నుండి ఈ నెల 13వ తేదీ సోమవారంకి మారుస్తూ తాజగా నేడు, సోమవారం ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. 13న సాధారణ సెలవుగా ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) కేఎస్ జవహర్రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో ప్రభుత్వం సెలవుల జాబితా లో ఈ నెల 12న (ఆదివారం) దీపావళి సెలవుదినంగా ఉంది. ఆ రోజు ఎలానూ పబ్లిక్ హాలీడే . అయితే ఈ క్రమం లో సాధారణ సెలవులు, ఆప్షనల్ సెలవుల జాబితాలో స్వల్పమార్పులు చేశారు. ఇటీవల ప్రధాన పండుగలు తిధులు ప్రకారం తగులు-మిగులు అంటూ రెండు రోజులకు వర్తిస్తుండటం విశేషం.
