సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీలో కూటమి సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఏపీపీఎస్సీ కీలక ప్రకటన చేసింది. ఇకపై ఎస్సీ, ఎస్టీ వర్గాలను మూడు కేటగిరీలుగా విభజిస్తూ ప్రభుత్వం ఇటీవల జీవో జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ రెండు కులాలను గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3గా విభజించింది. ఇక ఈ విభజన ఏప్రిల్ 19, 2025 నుంచి అమలులోకి వస్తున్నట్లు సాధారణ పరిపాలన విభాగం జీవోను జారీ చేసింది.ఈ నేపథ్యంలో వన్ టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ (OTP) ఉన్న షెడ్యూల్డ్ కులాలకు చెందిన అభ్యర్ధులు అందరూ తమ షెడ్యూల్ కుల గ్రూప్ వివరాలను సరిచేసుకోవాలని ఏపీపీఎస్సీ ప్రకటన జారీ చేసింది. త్వరలో ఏపీపీఎస్సీ విడుదల చేయనున్న జాబ్ నోటిఫికేషన్‌లకు దరఖాస్తు చేసుకోవాలంటే ఓటీపీలో ఆయా కులాలకు చెందిన అభ్యర్ధుల గ్రూపు వివరాలు ఓటీపీలో ఎంటర్ చేయాలని తెలిపింది. తాజాగా విడుదలైనAPPSC గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాల్లో 182 మంది ఇంటర్వ్యూకు అర్హత సాధించారు.
