సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సంక్రాంతి పర్వదినాన నిరుద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. సంక్రాంతి తరువాత మెగా డీఎస్సీ నోటిఫికేష్ విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఇదే విషయాన్ని నేడు, శనివారం సాయంత్రం మీడియా తో రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. సంక్రాంతి పండుగ తరువాత మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. ఉద్యోగాల భర్తీకి సంబంధించి విధివిధానాలను త్వరలోనే ప్రకటిస్తామన్నారు. డీఎస్సీ నోటిఫికేషన్‌పై ఇప్పటికే సీఎం జగన్‌తో చర్చించామన్నారు. రాష్ట్రంలో ఎన్ని ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ ఉన్నాయి, ఉద్యోగాల భర్తీకి సంబంధించి విధి విధానాలను త్వరలోనే ప్రకటిస్తామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *