సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్ ఆంధ్రప్రదేశ్‌లో సర్పంచులు, ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యుల పదవీ కాలం 2026 మార్చి నాటికి ముగుస్తోంది. దీంతో ఎన్నికల నిర్వహణకు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ అక్టోబరు 22న లేఖ రాశారు. గ్రామ పంచాయతీ విభజనపై, పునర్నిర్మాణంపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలని లేఖలో పేర్కొన్నారు. దానితో ఏపీ ప్రభుత్వం గ్రామ పంచాయతీల విభజన, పునర్నిర్మాణంపై నిషేధాన్ని తాత్కాలికంగా ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీనితో పంచాయతీలను విభజించడం, లేదా దగ్గరలోని పురపాలక సంఘ పట్టణాలలో నగరాలలో కలపదానికి అవకాశం కల్పించాయి.మరోవైపు, కూటమి ప్రభుత్వం పంచాయతీ రాజ్ వ్యవస్థలో కీలక సంస్కరణలు లో భాగంగా ఇప్పటివరకు ఉన్న 7,244 క్లస్టర్ల స్థానంలో.. 13,351 గ్రామ పంచాయతీలను ఇకపై స్వతంత్ర పరిపాలనా యూనిట్లుగా వ్యవహరిస్తారు. దీంతో ప్రతి పంచాయతీలోనూ పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, గ్రామీణ ప్రణాళిక, వీధి దీపాలు, ఇంజినీరింగ్, ఆదాయం, పన్ను వసూళ్లు వంటి విభాగాలు ఉంటాయి. మరి ఈమార్పులు ఎంతవరకు ఫలప్రదం అవుతాయో? మరి కూటమి పార్టీలు తో వైసీపీ మద్దతు అభ్యర్థులు ఎలా తలపడతారో?లేక ఏకగ్రీవాలకు మ్రొగ్గు చూపుతారో? చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *