సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ ఎన్నికల నేపథ్యంలో వాలంటీర్ సేవలు నిలుపుదల చెయ్యాలని, వారు అధికార పార్టీకి అనుకూలంగా పనిచేసే అవకాశం ఉందని చేసిన విజ్ఞప్తి ని ఈసీ ఆమోదించి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ..ఏపీలో పెన్సనర్ల విషయంలో నెల వారి పింఛన్ అందుకొంటున్న వారిని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. ఇక సచివాలయ సిబ్బంది తో పింఛన్ లుపంపిణీ చెయ్యాలన్న ఆదేశాలు ఉన్నపటికీ వారికీ కష్టసాధ్యంగా మారింది. ఒక ప్రక్క ఎన్నికల విధులు, ఓటర్లు స్లిప్ ల తయారీ పంపిణి తో వారు ఇబ్బందులు పడుతున్నారు. ఇక వృద్దులకు వారి బ్యాంకు అకౌంట్లలో డైరెక్ట్ గా పించన్ వెయ్యాలని బ్యాంకు నుండి వారు తీసుకోవచ్చునని అధికారులు పేర్కొన్నప్పటికీ . నిన్న (బుధవారం) మేడే బ్యాంకులకు సెలవు కావడంతో ఈరోజు గురువారం ఉదయం నుంచి బ్యాంకుల వద్దకు పెన్షనర్లు చేరుకున్నారు. పెన్షన్ల కోసం బ్యాంకుల వద్ద పెన్షన్‌దారులు పడిగాపులు కాస్తున్నారు. కొన్ని బ్యాంకులలో వృద్ధులు, వికలాంగులు వచ్చి పెన్షన్లు తీసుకునే క్రమంలో బ్యాంకు అకౌంటు రన్నింగ్‌లో లేదని బ్యాంకు అకౌంటు రన్నింగ్‌లో పెట్టుకోవాలంటే ఆధార్ జిరాక్స్, పాన్ జిరాక్స్, బ్యాంకు వాళ్ళు ఇచ్చిన అప్లికేషన్ ఫిలప్ చేసి ఇవ్వాలని, ఇవ్వని కరెక్ట్ చేసాక రేపు వచ్చి డబ్బు తీసుకోవచ్చునని బ్యాంక్ సిబ్బంది చెప్పటం తో పింఛన్ దారులు విస్తుపోతున్నారు. తమను ఎండల్లో త్రిప్పకండని ప్రాధేయపడుతున్నారు. వాలంటీర్లు ఉండి ఉంటె చక్కగా ఇంటికి వచ్చి పింఛన్ ఇచ్చేవారు కదా? రాజకీయ పార్టీల కక్ష పూరిత రాజకీయాలకు తమకు వచ్చాయి తిప్పలు అని నిట్టురుస్తున్నారు.
