సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రైవేట్ డిగ్రీ కళాశాలల యాజమాన్యాలు బోధన రుసుములు (విద్యార్థుల పీజు రియంబర్స్మెంట్) వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశాయి. లేని పక్షంలో ఈ నెల 22 నుంచి కళాశాలలు మూసివేస్తామని హెచ్చరించాయి. రాష్ట్ర ప్రభుత్వం రుసుములు విడుదల చేయకపోవడంతో సమస్యలు వస్తున్నాయని, ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేకపోతున్నామని, విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ఇప్పటివరకు సహనంగా ఉన్నామని, యాజమాన్యాలు ఆవేదన వ్యక్తం చేశాయి. ప్రభుత్వం స్పందించకపోతే అక్టోబరు మొదటి వారంలో నిరవధిక సమ్మె చేస్తామని హెచ్చరించారు. ఈ మేరకు ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌కు వినతిపత్రం సమర్పించింది. ప్రభుత్వం నుంచి రావాల్సిన రుసుములు చెల్లించకపోతే కాలేజీలు నడపలేమని ఆవేదన వ్యక్తం చేశారు. చాలాసార్లు ప్రభుత్వానికి, అధికారులకు విజ్ఞప్తి చేసినా ఫలితం లేదన్నారు.అలాగే యూనివర్శిటీలలో ఫీజులు కట్టకపోతే పనులు జరగడం లేదని ప్రైవేట్ డిగ్రీ కాలేజీల యాజమాన్యాల సంఘం నేతలు చెబుతున్నారు.
