సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రాష్ట్రంలో స్థానిక ప్రజల ఆర్ధిక , విద్య అర్హతలు , అష్టి సామజిక పరిస్థితులకు సంబంధించి పూర్తీ వివరాలకు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో గత డిసెంబర్లో ఏకీకృత కుటుంబ సమగ్ర సర్వే మొదలవ్వగా.అది జనవరి 12 వరకు ఈ సర్వే పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. కానీ ప్రభుత్వం విధించిన డెడ్ లైన్ ముగిసినా సర్వే ఇంకా పూర్తి కాలేదు. పధకాలు పోతాయని కొందరు ప్రజలు అనుమానాలు మధ్య , ఇంటర్ నెట్ సాంకేతిక్ సమస్యలతో ఆలస్యం అయ్యింది. దీంతో గడువును ఫిబ్రవరి 10 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సర్వే ద్వారా ఏపీలోని ప్రతీ కుటుంబం వివరాలు నమోదు చేయనున్నారు. ఆన్లైన్ విధానంలో ఈ సర్వే చేపడుతుండగా.ఈ సమగ్ర కుటుంబ సర్వేలో ఇంటింటికి వెళ్లి 20 రకాల అంశాలపై సమాచారం సేకరించి ఆన్లైన్లో నమోదు చేయాల్సి ఉంటుంది. గంటకు పైగా ఒకో కుటుంబానికి సమయం పడుతుందని, సిగ్నెల్ లేకపోతె మరోసారి ఆ కుటుంబాన్ని కలవాలని సచివాలయ సిబ్బంది వాపోతున్నారు. ఆన్ లైన్ కాకుండా అఫ్ లైన్ సర్వే అయితే బాగుటుందని అంటున్నారు.
