సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల బస్సు ప్రమాదాలు, సీరియల్ మరణాలు దారుణ విషాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజగా నేడు శుక్రవారం తెల్లవారు జామున .. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం తులసిపాకలు ఘాట్ రోడ్‌లో బస్సు అదుపుతప్పి లోయలో పడి ప్రమాదం (Bus Accident) జరిగింది. ఈ ప్రమాదంలో 10 మంది మృతిచెందగా.. 20మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో మృతిచెందిన వారిలో 8మందిని గుర్తించారు. స్థానికులు వారిని వెంటనే రక్షించే ప్రయత్నం చెయ్యడం మేలు చేసింది. తీవ్రంగా గాయపడిన వారిని ఆసుపత్రిలో చేర్చారు. వారి పరిస్థితి విషమంగానే ఉందని తెలుస్తుంది. ఈ ప్రేవేటు బస్సు భక్తులు పుణ్యక్షేత్రాల దర్శననీపద్యంలో భద్రాచలం లో బయలు దేరి అరకు వెళుతుంది. ఈ బస్సు ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ బస్సు ప్రమాదంలో ప్రాణనష్టం సంభవించడం చాలా బాధాకరమని, మరణించిన వారి కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50,000 ఎక్స్ గ్రేషియా పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి ఇస్తున్నామని తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు .సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మాజీ సీఎం జగన్ కూడా తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేసారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *