సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి టీడీపీ-జనసే-బీజేపీ కలసి పనిచేసే దశగా చర్చ లు సాగుతున్నాయి. రాష్ట్రంలో బీజేపీ కోరినన్ని సీట్లు ఇస్తే ( 7 ఎంపీ 20 కి పైగా అసెంబ్లీ సీట్లు ? )కేంద్ర బీజేపీ పెద్దలు పొత్తు ఖరారు చేస్తారని.. లేకపోతె ఎన్నికల తరువాత సీఎం జగన్ కేంద్రంలో బీజేపీ ఆద్వర్యంలోని ఎన్డీయే కూటమిలో చేరటానికి ప్రధాని మోడీ వద్ద సంసిద్ధత వ్యక్తం చేసారని వార్తలు వస్తున్నా నేపథ్యంలో .. బీజేపీ రాజ్య సభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు నేడు, సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. పొత్తులపై ఆసక్తికర వ్యా ఖ్య లు చేశారు.. బీజేపీ-టీడీపీ-జనసేన కూటమి పొత్తుపై పార్టీ అధిష్టానం నిర్ణయమే మా నిర్ణయం అని స్పష్టం చేశారు. పొత్తు కుదిరిన లేకపోయిన ఇక, విశాఖపట్నం లోక్‌సభ స్థానం నుంచి ఎవరు పోటీ చేయాలన్నది బీజేపీ అధిష్టానమే నిర్ణయిస్తుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో సుధీర్ఘాంగా సేవలు అందించిన దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కు భారత రత్న రావడం చాలా గొప్ప విషయం అన్నా రు. ఇక, విశాఖ స్టీల్ ప్లాం ట్ ప్రైవేటీకరణ నిలిపివేయబడిం ది.. అని చాలా సార్లు చెప్పాను అని గుర్తుచేశారు.. మరోవైపు.. తమ ఉనికి కాపాడుకోవడం కోసం కాంగ్రెస్ పార్టీ ఏపీ అడ్జక్షురాలు ,వైఎస్ షర్మిల వంటివాళ్లు టీవీల్లో కనిపించడానికి చాలా ప్రయత్నం చేస్తుంటారు అంటూ ఎద్దేవా చేశారు
