సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీలో 2014 ఎన్నికలలో టీడీపీ జనసేన, బీజేపీ కూటమి తరహాలో 2024 ఎన్నికలలో మరల అదే మ్యాజిక్ చేయాలనీ అధికారంలోకి రావాలని జరుగుతన్న టీడీపీ జనసేన అధినేత ల ప్రయత్నాలు తెలిసిందే.. ఈ నేపథ్యంలో ఆ కలయిక మరోసారి పునరావృత్తం కావడానికి ఏపీలో గతంలో ఎన్నడూ లేని విధంగా బీజేపీ బలపడటానికి రాజమార్గం స్వష్టంగా కనిపిస్తుంది. గత గురువారం రాత్రి ఢిల్లీ లో చంద్రబాబు , పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రి అమిత్ షాతో జరిపిన చర్చలు సానుకూలంగా జరిగాయి అని? ఈ చర్చలలో బీజేపీ కి 6 ఎంపీ స్థానాలు ఇవ్వడానికి 9 అసెంబ్లీ స్థానాలు ఇవ్వడానికి చంద్రబాబు అంగీకరించారని అయితే బీజేపీ మరిన్ని అసెంబ్లీ స్థానాలు అడగటంతో చర్చలు పొడిగించినట్లు తెలుస్తుంది..బీజేపీ అడిగిన అసెంబ్లీ స్థానాలు లో టీడీపీ కేటాయింపు కు అంగీకరించినట్లు భావిస్తున్న స్థానాలు ఇవే.. శ్రీకాళహస్తి, జమ్మలమడుగు, కైకలూరు, ధర్మవరం, విశాఖ (నార్త్), ఏలూరు, రాజమండ్రి, అరకు, విజయవాడ సెంట్రల్ అసెంబ్లీ స్థానాలతోపాటు బీజేపీ కి లోక్ సభలో తిరుపతి, రాజంపేట, రాజమండ్రి, అరకు, నరసాపురం, ఏలూరు లోక్ సభ సీట్ల కేటాయింపుకు ప్రాధమికంగా అంగీకారం జరిగినట్లు భావిస్తున్నారు. ఇంకా అదనపు అసెంబ్లీ సీట్ల కేటాయింపుపై స్తబ్ధత నెలకొంది. ఈ నెల 10వ తేదీన బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశమై అభ్యర్థులను ప్రకటించనుంది. ఆ లోపు టీడీపీ జనసేనతో బీజేపీ పొత్తు ఖరారయ్యే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *